1. Introduction
ప్రస్తుతం Tech ప్రపంచంలో AI గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. చాలామంది AI అంటే కేవలం chat అనుకుంటారు. కానీ నిజం ఏంటంటే – AI tools ని correct గా use చేస్తే, ఇంట్లో కూర్చొనే కొత్త skills నేర్చుకోవచ్చు, మంచి money కూడా earn చేయవచ్చు. ఈ post లో, 2026లో తెలుగు వారు తప్పక తెలుసుకోవాల్సిన top AI tools గురించి చూద్దాం.

ఇంతకుముందు మనం ఏదైనా skill నేర్చుకోవాలి అనుకుంటే.. ఓ particular institute లోకి వెళ్లాలి లేదంటే బయట ఎక్కడైనా coaching center వెతుక్కోవాలి. కానీ ఇప్పుడు మనం online లో, ఇంట్లో ఉండే కొత్త skills ని నేర్చుకోవచ్చు. దానికోసం చాలా platforms ఉన్నాయి. YouTube, Facebook, Instagram లాంటి platforms లో కూడా చాలామంది చిన్న videos, పెద్ద videos తో సహా మనకి ఉచితంగా నేర్పిస్తున్నారు.
ఇప్పుడు AI వల్ల ఇది మరింత సులభం అవుతుంది. ఎందుకంటే కొన్ని విషయాలు కోసం పది వేర్వేరు websites లో వెతకడం కంటే – ఒకే website లో ChatGPT, Gemini AI లాంటి tools తో మనం మొత్తం info ఒకే దగ్గర తెలుసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. ఇప్పటికే ఇంట్లో ఉండి చాలామంది సంపాదిస్తున్నారు.
2. AI తో మనం ఏం చేయగలం?
A) Content Writing & Blogging
మీకు ఏ topic మీద అయినా కొంచెం idea ఉంటే చాలు. ChatGPT లేదా Google Gemini వంటి tools సాయంతో articles, blog posts రాయొచ్చు. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి: AI ఇచ్చిన answer ని direct గా copy కొట్టకండి – దాన్ని మీ own words లో, మీ experience తో మార్చి రాయండి. అప్పుడే Google లో good ranking వస్తుంది.
[Image: ChatGPT స్క్రీన్‌షాట్ – తెలుగులో ఒక article రాయమని అడుగుతున్న user]
ఇప్పుడు నేను నా experience చెప్తాను. Already trained చేయబడిన professional పదాలు ఉపయోగించుకొని AI blog posts రాస్తుంది. కానీ దానికి తెలుసు – ఇది AI రాసిందా లేదా మనిషి రాసిందా అని. రెండింటికి తేడా చాలా స్పష్టంగా ఉంటుంది.
కాబట్టి మీరేం చేస్తారంటే:
- AI ని use చేసి, దాంట్లో ఉన్న topic ని మీరు బయట official websites లో కొంచెం extra information తీసుకోండి.
- ఆ తర్వాత ChatGPT ని మీ మాటల్లో రాయమని చెప్పండి – “నా మాటలతో కలిపి రాయి” అంటే, నీ tone ని బట్టి అది మళ్లీ రాస్తుంది.
- లేదంటే సొంతంగా మీరే type చేసుకొని రాసుకుంటే ఇంకా స్పష్టంగా ఉంటుంది.
అంటే మనకి ఇంతకుముందు రెండు గంటలు పట్టింది – ఇప్పుడు అరగంట లోనే ఒక blog post రాసి publish చేయొచ్చు. Google తో తయారు చేయబడిన tools ఉపయోగించి మనం blog posts రాస్తే, ఆ Google కనిపెట్టలేదని ఎలా అనుకుంటారు? కచ్చితంగా కనిపెడుతుంది. కాబట్టి మన సొంత style ని దానికి add చేసి రాయండి. అప్పుడే time save అవుతుంది, quality కూడా ఉంటుంది.
B) Graphic Design & AI Art
Canva AI లేదా Midjourney use చేసి నిమిషాల్లో logos, social media posts తయారు చేయొచ్చు. వాటిని Fiverr లేదా Upwork లాంటి freelance websites లో sell చేయొచ్చు. మీకు design రాకపోయినా problem లేదు – AI మీ backbone లా work చేస్తుంది.

మీరు ఇలా అనుకోవచ్చు – “వాళ్లే చేసుకుని పెట్టుకోవచ్చు కదా, ఎందుకు నా దగ్గర కొంటారు?” కానీ ప్రతి ఒక్కరికీ AI tools use చేయడం పూర్తిగా రాదు. ఇదే మీ అవకాశం. AI మీద కొంత understanding తెచ్చుకొని, graphic design, logos, banners, DP లు లాంటివి మీరే create చేసుకోండి. Official freelance websites లో పెడితే… ఆర్డర్లు రావడం మొదలవుతాయి.
ఇంతకుముందు ఇవే logos మనం Photoshop వంటి కష్టమైన tools లో చేసేవాళ్లం. ఇప్పుడు AI వల్ల చాలా సులభం అయింది.
C) Video Editing & Voice Over
ElevenLabs వంటి AI tools తో real voice లాగా voice over create చేయొచ్చు. ఇలా మీరు YouTube channel run చేయడం చాలా easy అవుతుంది. Studio, mic, voice artist – ఏదీ అవసరం లేదు.

ఇంతకుముందు YouTube channel start చేయాలంటే:
- Video editing apps మీద అనుభవం ఉండాలి
- లేదంటే computer లో video editing softwares మీద అవగాహన లేకపోతే చాలా కష్టం
కానీ ఇప్పుడు చాలా tools అందుబాటులో ఉన్నాయి. మీరు మీ matter ఇచ్చి, requirement clarify చేస్తే… AI తోనే video edit చేయించుకోవచ్చు. మీరు record చేసిన video ని కూడా చూపించొచ్చు. రెండు కలిపి చేయడం వల్ల time save అవుతుంది, video quality కూడా బాగుంటుంది.
3. నేను నేరుగా use చేస్తున్న AI Tools – My Personal Experience
ఇప్పుడు నేను నా personal experience share చేస్తాను. నేను ఈ కింది tools ని daily use చేస్తున్నాను.
| AI Tool Name | Use | ఎవరికి work అవుతుంది? |
| ChatGPT / Gemini | Text & Information | Students, Content Writers |
| Canva AI | Designing | Social Media Users |
| ElevenLabs | Voice Over | YouTubers |
మనం దీనికోసం format సొంతంగా ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు మీ requirement ని స్పష్టంగా, మీ మాటల్లో ChatGPT, Gemini కి ఇచ్చి… దానితో format తయారు చేయించండి. ఆ format ని మళ్లీ దానికి ఇచ్చి, మనకు కావాల్సిన requirements తయారు చేయించొచ్చు. దానితో video script, audio script రాయొచ్చు. పూర్తిగా AI మీద ఆధారపడకుండా, మన సొంత idea ని add చేస్తే – మన requirement perfect గా తెలుస్తుంది, time కూడా save అవుతుంది.

Canva AI గురించి నా experience:
Canva ఇప్పుడు చాలా trending లో ఉంది. ఇందులో మన ఏదైనా image ని, logo ని, thumbnail ని ప్రొఫెషనల్ గా create చేసుకోవచ్చు. Free version కొంతవరకు అందుబాటులో ఉంది. దీని గురించి YouTube లో చాలా videos ఉన్నాయి – నేను చూసి నేర్చుకున్నాను. నాకు ఇది చాలా use అవుతుంది. ఇంతకుముందు నేను ఒక thumbnail తయారు చేయడానికి రెండు గంటలు పెట్టేవాడిని. ఇప్పుడు Canva AI use చేసి పది నిమిషాల్లో thumbnail ready చేసేస్తున్నాను.
ElevenLabs గురించి నా experience:
మీరు ఆడియో ఇవ్వడానికి మంచి mic కొనుక్కోవాలి… లేదంటే మీ పక్కన disturbance ఉంటుంది… లేదంటే మీరు మీ నోటితో మాట్లాడటానికి సిగ్గుగా అనిపిస్తుంది… ఇలాంటి situations లో ElevenLabs చాలా useful గా ఉంటుంది. ఇందులో మీకు కావల్సిన script ఇస్తే – అది clear గా audio ని create చేస్తుంది. మీరు script ని ChatGPT తో create చేసుకుని ఇందులో ఇస్తే – స్పష్టమైన voice over ready అవుతుంది.
ఇంకా కొన్ని advanced tools మీ voice లాగే వచ్చే options కూడా ఉన్నాయి. కాకపోతే అది పూర్తిగా ఉచితం కాదు. మీరు రెండు నిమిషాల మీ audio ఇచ్చి, script ఇస్తే – అదే మీ గొంతుతో కొత్త audio create చేస్తుంది. నేను ఈ tool ని నా reels create చేయడానికి use చేస్తున్నాను. అక్కడ నా voice direct ga ఇవ్వకుండా… ఈ tool తో voice create చేసుకుని… reels చేస్తున్నాను.
4. AdSense కోసం జాగ్రత్తలు (Important Tips – నా నుంచి నేర్చుకోండి)
AI ని use చేసుకోండి, blind గా copy కొట్టకండి.
- AI నుంచి వచ్చిన content ని direct ga paste చేయడం వల్ల AdSense మీ site ని reject చేసే chance చాలా ఎక్కువ.
- AI ని ఒక assistant లా treat చేయండి. Ideas, points, outline కోసం use చేయండి. కానీ final post మీ own language లో, మీ experience గా ఉండాలి.
- Google కి ఇష్టమైంది: Originality, value ఇచ్చే content.

ఇప్పుడు నేను ఎలా చేస్తానో చెప్తాను. నేను ChatGPT లో ఒక post రాయించుకుంటాను. దాంట్లో ఉన్న information ని చదివి, నాకు అర్థమైనంతగా అర్థం చేసుకుంటాను. ఆ తర్వాత కొంచెం extra information internet లో వెతుకుతాను. అక్కడ ఉన్న headings, titles ని పట్టుకొని – నా సొంత voice, నా style లో type చేసి ఇస్తాను. దీనివల్ల:
- Duplicate content లాగా ఉండదు
- Time కూడా చాలా save అవుతుంది
- ఇంతకుముందు రెండు గంటలు పట్టేది – ఇప్పుడు అరగంటలో పూర్తవుతుంది
నా సలహా: మీరు AdSense కి apply చేసేముందు… కనీసం 20 నుండి 30 posts రాయండి. అది కూడా 1000 words కి పైగా ఉండేలా, మీ సొంత style లో రాయండి. అప్పుడు AdSense కి apply చేస్తే – మీకు approve అయ్యే chance 90% ఎక్కువ. ఇది నేను ప్రయత్నించిన తర్వాత మీకు సలహా ఇస్తున్నాను.
5. Conclusion (ముగింపు)
AI మన jobs తీసేస్తుందనే fear అవసరం లేదు. AI ఒక tool – మన work ని easy చేయడానికి. సరిగ్గా నేర్చుకుంటే, ఇది మీ career కి, skill set కి rocket fuel లాంటిది. పైన చెప్పిన tools ని ఈ week ఒకసారి try చేయండి.
[Image: ఒక వ్యక్తి AI tool నుంచి output తీసుకుంటూ, దాన్ని తన style లో edit చేస్తున్నట్లు – cycle diagram]
ఒక ఉదాహరణతో చెప్పాను వినండి. మనం ఇంతకుముందు నడిచి వెళ్లేవాళ్లం. తర్వాత ఒక car కొనుక్కుందాం అనుకుందాం. Car drive చేయడానికి మనం brake, accelerator, clutch, steering – ఇవన్నీ మనం use చేసి car ని drive చేసుకుంటాం. ఇప్పుడు అది కష్టం అనిపించి మనం ఒక driver ని పెట్టుకుంటాం. Driver ని పెట్టుకున్నంత మాత్రాన… మన car ని వదిలేయలేదు కదా? ఎక్కడికి వెళ్లాలో మన మాటలతో చెప్తే… ఆ driver తన driving skill ని use చేసి car ని drive చేస్తూ… మనల్ని destination కి తీసుకెళ్తాడు.
అంటే మన అవసరం ఇంకా ఉంది – మన address చెప్పేది మనమే కదా? AI అంటే కూడా అంతే. మనం ఏది కావాలో clear ga ఆదేశిస్తే… అది పని చేస్తుంది. పూర్తిగా AI మన jobs ని తీసేయదు. నేర్చుకోండి, use చేయండి, grow అవ్వండి.
ఏమైనా doubts ఉంటే, కింద comments లో ask చేయండి – reply ఇస్తాను.
6. FAQ (తరచుగా అడిగే ప్రశ్నలు)
1. AI వల్ల నా job పోతుందా?
No, అస్సలు కాదు. పైన car & driver example చెప్పాను కదా – AI ఒక driver లాంటిది. మనం address (instruction) ఇవ్వాలి. AI use చేయడం నేర్చుకునే వాళ్లకే future లో ఎక్కువ opportunities ఉంటాయి.
2. ఈ AI tools నిజంగా free ఉంటాయా?
Yes, చాలా tools కి free versions ఉన్నాయి (ChatGPT, Canva AI, ElevenLabs free plan). కొన్ని advanced features కావాలంటే monthly కొంత pay చేయాలి. నేను కూడా free versions తోనే start చేసి, తర్వాత అవసరానికి upgrade చేసుకున్నాను.
3. ఈ tools తెలుగులో work చేస్తాయా?
Yes. ChatGPT, Gemini తెలుగులో answers ఇస్తాయి. Canva AI లో తెలుగు type చేయొచ్చు. నేను కూడా తెలుగు కంటెంట్ కోసం ఇవే use చేస్తున్నాను.
4. AdSense approve అవ్వాలంటే ఎన్ని posts రాయాలి?
నా experience ప్రకారం – కనీసం 20 నుండి 30 posts, ప్రతీది 1000 words పైన, మీ సొంత style లో రాయండి. అప్పుడు apply చేస్తే 90% chance approve అవుతుంది.
5. AI tools వల్ల time ఎంత save అవుతుంది?
నా personal experience: ఇంతకుముందు ఒక blog post కి 2 గంటలు పట్టేది. ఇప్పుడు AI tools use చేస్తే 30 నిమిషాలు కూడా చాలదు. Thumbnail కి 2 గంటలు పట్టేది – ఇప్పుడు 10 నిమిషాలు.
6. మొదటి నుంచి నేర్చుకోవాలంటే ఎలా start చేయాలి?
YouTube లో free tutorials చూడండి (నేను అలాగే నేర్చుకున్నాను). ముందు ChatGPT ని basic questions అడగడం start చేయండి. తర్వాత Canva AI try చేయండి. ఒక్కో tool ని ఒక్కో వారం practice చేయండి. నెల రోజుల్లో మీరు confident అవుతారు.
Also Read : మీ android phone slow speed fix కోసం ఈ 5 సింపుల్ Tips తో Speed పెంచుకోండి













