ఇటీవలి కాలంలో eSIM వినియోగం పెరిగిపోవడంతో, Jio సంస్థ 2025 నుండి eSIM పోర్టింగ్ పద్ధతిలో కొన్ని మార్పులు చేసింది. చాలామందికి ఈ కొత్త రూల్స్ గురించి క్లారిటీ లేక గందరగోళం అవుతోంది. ఈ టెక్నాలజీ నాకు తెలిసి చాలా మందికి ఉపయోగపడుతుంది. అందుకే, ఈ ఆర్టికల్‌లో eSIM పోర్ట్ అంటే ఏమిటి, 2026లో ఏం మారింది, ఎలా చేయాలి అన్న విషయాలు సింపుల్‌గా, స్పష్టంగా మీకు అర్ధమయ్యేవిధంగా చక్కగా వివరిస్తున్నాను.
ఈ సిమ్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నప్పటికీ దాంట్లో ఒక ఉపయోగం ఏమిటి అంటే ఎప్పుడైనా మన మొబైల్ పోగొట్టుకున్నప్పుడు లేదా దొంగలించబడినప్పుడు దొంగలించన వ్యక్తి లేదంటే దొరికిన వ్యక్తి మొదటి చేసే పని ఏంటంటే మన సిమ్ కార్డ్ ని బయటికి తీసేస్తారు. అలాంటప్పుడు మనం మన పోగొట్టుకున్న మొబైల్ ని కొన్ని apps ఉపయోగించి ట్రాక్ చేయడం అసాధ్యం ఎందుకంటే మనం మన మొబైల్ ట్రాక్ చేయాలంటే మనం సిమ్ కార్డ్ అందులో ఉండాలి దానికి నెట్వర్క్ మరియు మొబైల్ డేటా on లో ఉంటే మనం కచ్చితంగా మన మొబైల్ ని పొందవచ్చు. ఒకవేళ సిమ్ కార్డు బయటికి తీసేస్తే మనం ఆ మొబైల్ ని మర్చిపోవడం తప్ప ఇంకేం చేయలేం. eSiM వల్ల చాలా ఉపయోగాలలో ఇది ఒక ఉపయోగం.
🔹 eSIM Porting అంటే సాధారణంగా ఏమిటి?
మనం ఫిజికల్ సిమ్‌ను ఒక నెట్‌వర్క్ నుంచి మరో నెట్‌వర్క్‌కు మార్చడాన్ని “పోర్టింగ్” అంటాం. eSIM కూడా అదే కానీ ఇందులో SIM కార్డ్ లేకపోవడంతో ప్రక్రియ కొంచెం భిన్నంగా ఉంటుంది. ఇది అంత ఆన్లైన్లో జరుగుతుంది. దీనికి ఈమెయిల్ తో లింక్ చేయబడుతుంది. కాబట్టి మనం ఒకవేళ మొబైల్ పోగొట్టుకున్న సరే వేరే ఒక మొబైల్ లో ఆ ఈమెయిల్ ను ఉపయోగించి మనం కొత్తగా మళ్లీ అదే నెంబర్ను రికవరీ చేసి ఉపయోగించుకోవచ్చు
ఇక్కడ మనం ఫిజికల్ సిమ్ ను ఉపయోగించము. అంటే ఒక ప్రాసెస్ తో కొన్ని సీరియస్ నెంబర్స్ ను ఉపయోగించి లేదంటే email లేదా మొబైల్ otp తో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. దీని ద్వారా sim swapping అనే టెక్నిక్ వల్ల జరిగే మోసాను మన అరికట్టవచ్చు. ప్రస్తుత కాలం జరుగుతున్న మోసాలను అరికట్టడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం ఒకవేళ ఎన్ని మొబైల్స్ మార్చుకున్న సరే మన ప్రతి మొబైల్ లో మనం ఫిజికల్ sim కాకుండా eSim ని మనం ఉపయోగించుకోవచ్చు. కాకపోతే నేను కొంత ప్రాసెస్ ఉంటుంది అది పూర్తి చేస్తే సరిపోతుంది.
🔹 2026లో వచ్చిన ముఖ్యమైన కొత్త మార్పులు
1️⃣ ఫిజికల్ సిమ్ ఉంటే ముందుగా eSIM గా మార్చాలి
ఇది చాలామందికి తెలియని విషయం.
ఫిజికల్ సిమ్ నుంచి directగా ఇంకో నెట్‌వర్క్‌కు పోర్ట్ కాదులే.
ముందుగా దాన్ని eSIM గా మార్చాలి, తరువాతే పోర్ట్ రిక్వెస్ట్ పనిచేస్తుంది. దీనికోసం కొంత ప్రక్రియ ఉంటుంది దాన్ని కచ్చితంగా పాటించాల్సిందే. ఇది మనకి డైరెక్ట్ గా esim దొరకదు మనం ఫిజికల్ సిమ్ తీసుకున్న తర్వాత దాన్ని eSim గా మార్చుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ sim swapping చేయడం చాలా కష్టం, కాబట్టి ఈ ప్రక్రియ ద్వారా మనం సురక్షితంగా ఉండొచ్చు.
2️⃣ Aadhaar ఆధారిత KYC తప్పనిసరి
2026 నుంచి ఏ కంపెనీకి పోర్ట్ చేసినా, Aadhaar OTP లేదా biometric ద్వారా ధృవీకరణ అవసరం.
ఇది సిమ్ స్వాప్ మోసాలు తగ్గించటానికి తీసుకున్న నిర్ణయం. eSIM వల్ల చాలామందికి ఉపయోగమేటంటే మన ఆధార్ డేటా తో వేరే వాళ్ళు కొత్త సిమ్ కార్డు తీసుకుని అవకాశం ఉండదు, మన ఆధార్ డేటాని దుర్వినియోగం చేసుకునే అవకాశం అస్సలు ఉండదు. అందుకే ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది.
3️⃣ కొత్తగా సిమ్/ప్లాన్ మార్చిన వాళ్లు 24 గంటలు వేచి ఉండాలి
మీరు కొత్త సిమ్ కార్డు తీసుకున్న అది యాక్టివేషన్ కావడానికి 24 గంటలు సమయం తీసుకునేది ఇంతకుముందు, ఇప్పుడు అలా కాకుండా మనం ఈ e sim వెంటనే ఆక్టివేట్ చేసుకోవచ్చు. సిమ్ తీసుకున్న కొన్ని గంటల తరువాత Activation పూర్తవుతుంది.
- కొత్త సిమ్ తీసుకున్నా,
- ప్లాన్ మార్చినా,
- కొత్త ఫోన్‌లో సిమ్ insert చేసినా,
24 గంటలు completed అయ్యే వరకు పోర్ట్ రిక్వెస్ట్ accept కాదు. ఇది భద్రాలో ఒక భాగంగా అన్ని అనుసంధించారు. దీనివల్ల 24 గంటల్లోపు ఏదైనా మోసాలు జరిగితే మనం అరికట్టవచ్చు. అందుకే ఈ ప్రక్రియను అవలంబించారు. దీనివల్ల మనకు క్రైమ్స్ జరిగే అవకాశం తక్కువ ఉంటుంది.
4️⃣ eSIM QR కోడ్‌ను సురక్షితంగా ఉంచుకోవడం అత్యంత ముఖ్యము
కొత్త నెట్‌వర్క్ eSIM ఇవ్వడానికి QR కోడ్ ఇస్తారు.
ఈ కోడ్ leak అవ్వకూడదు
ఎందుకంటే ఇది మీ SIM కు సంబంధించిన access point. నీకైతే మనకి తెలియకుండా వేరే వాళ్ళు ఆ సీరియల్ నెంబర్ మీద సిమ్ కార్డ్ తీసుకున్న అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉంచుకోవడం మంచిది. ఇది మళ్ళీ మనకు ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే మనం మళ్లీ మొబైల్ మార్చినప్పుడు ఇచ్చువారు అనేది ఉపయోగించి మనం ఆ మొబైల్ కి ట్రాన్స్ఫర్ చేయడం సులభం అవుతుంది. అందుకోసం దాన్ని భద్రపరచుకోవడం చాలా ముఖ్యం.
Google Drive / Files లో లాక్ పెట్టి save చేయడం ఉత్తమం. ఇందులో చాలా భద్రంగా ఉంటుంది. ఆ గూగుల్ డ్రైవ్ లోనే పాస్వర్డ్ మాత్రం మర్చిపోకండి. ఒకసారి మర్చిపోతే మళ్ళీ ఆ కీ వారినే మన access చేయలేము. ఇక పాస్వర్డ్ గుర్తు నుంచి ఈ మెయిల్ లో మాత్రమే store చేయండి.
5️⃣ పొరపాటున పోర్ట్ రిక్వెస్ట్ పెట్టినా వెంటనే రద్దు చేసుకునే అవకాశం
గతంలో ఇది పెద్ద సమస్య. మళ్లీ క్యాన్సిల్ చేయాలంటే కొంత ఎక్కువ ప్రాసెస్ ఉండేది.
ఇప్పుడు అయితే 4 గంటల లోపే users SMS పంపి రిక్వెస్ట్ cancel చేయొచ్చు. కాబట్టి పాత పద్ధతి కంటే ఈ పద్ధతి చాలా ఉపయోగకరంగా ఉందని నా ఉద్దేశం. నాకు తెలిసి ఈ ఆప్షన్ చాలా మందిక ఉపయోగకరంగా మారింది. కొన్ని నెలల క్రితం నా స్నేహితుడికి ఇది చాలా ఉపయోగంగా పడింది. నేనైతే ఇంకా ఈ సిమ్ తీసుకోలేదు. అతని ద్వారా నాకు ఈ అనుభవం వచ్చింది.
🔹 2025 eSIM Porting స్టెప్స్ (Simple Guide)
- మీ మొబైల్ నుంచి
PORT <మీ నంబర్> → 1900 కి SMS పంపాలి - UPC కోడ్ వస్తుంది
- మీరు వెళ్లాలనుకునే నెట్‌వర్క్ స్టోర్‌కి వెళ్లాలి
- Aadhaar ఆధారిత KYC పూర్తి చేయాలి
- మీ ఫోన్‌లో ఇచ్చిన QR కోడ్‌ను స్కాన్ చేయాలి
- 24 నుండి 48 గంటల్లో నెట్‌వర్క్ మారిపోతుంది
ఈ సింపుల్ పద్ధతిలో మనం eSIM ని చాలా త్వరగా మనం తీసుకుని యాక్టివేషన్ చేసుకోవచ్చు అలానే కాల్స్ చేసుకోవచ్చు. ఇది భద్రతతో పాటు వేగవంతంగా మనం కొత్త సిమ్ కార్డ్ ని తీసుకోవచ్చు. ఇంతకుముందు అయితే 24 గంటలు దాటి వేచి చూడాల్సి ఉండేది ఇప్పుడు కొన్ని గంటల్లోనే మొత్తం ప్రక్రియ పూర్తయి కాల్స్ చేసుకోవడం ఇంటర్నెట్ ఉపయోగించుకోవడం అంతా కూడా పూర్తవుతుంది. నీ భద్రతతో పాటు మనకు సమయాన్ని కూడా ఆదా ఆలోచిస్తుంది.
🔹 ఈ మార్పులు ఎందుకు చేశారు?
ఇటీవల eSIM పెట్టుకుని SIM swapping/OTP hacking మోసాలు పెరిగాయి.
అందుకే verification process కఠినం చేశారు.
అదే సమయంలో genuine users కి porting ఎక్కువ సమయం తీసుకోకుండా ఉండేలా కొన్ని స్టెప్స్ సింపుల్ చేశారు. ఈ కొత్తగా వచ్చే ప్రాసెస్ తో సిమ్ కార్డ్ తీసుకొని సమయం కూడా చాలా తక్కువ ఇంతకుముందు కనీసం 30 నిమిషాలు సమయం పట్టేది, ఇప్పుడు కేవలం ఐదు నిమిషాల్లో eSIM మనం తీసుకోవచ్చు యాక్టివేషన్ చేసుకోవచ్చు అలానే కాల్స్ కూడా చేసుకోవచ్చు. ఇదే కదా ఇప్పుడు కస్టమర్స్ కి కావాల్సిన ఒకకరమైన సదుపాయం.
🔹 ఎవరికీ ఇది ఉపయోగం?
- సిగ్నల్ సమస్యతో ఇబ్బంది పడేవారికి
- iPhone, Pixel, Samsung వంటి eSIM ఫోన్లు వాడేవారికి
- SIM సెక్యూరిటీ మీద దృష్టి ఉన్నవారికి
- తరచూ నెట్‌వర్క్ మార్చేవారికి
కొందరు ఎప్పటికప్పుడు ప్రదేశాలు మారుతూ ఉంటారు వాళ్లకి అక్కడ ప్రస్తుతం వాడుతున్న సిమ్ కార్డ్ నెట్వర్క్ ఉండకపోవచ్చు అలాంటివాళ్లు తరచుగా వాళ్ళ నెట్వర్క్ ని మార్చాల్సి ఉంటుంది. ఫిజికల్ సిమ్ కార్డు కంటే eSIM త్వరగా మార్చుకోవచ్చు అలానే ఆక్టివేషన్ చేసుకోవచ్చు, ఉపయోగించుకోవచ్చు అలానే మళ్లీ అవసరమైనప్పుడు వేరే నెట్వర్క్ కి మారిపోవచ్చు.
అలానే esim వల్ల ఇంకో పెద్ద ఉపయోగం ఉందిమనకి అదేంటంటే, మన మొబైల్ ఎవరైనా దొంగతనం చేసిన లేదా మనం పోగొట్టుకున్న, మన మొబైల్ దొరికిన వ్యక్తి మొబైల్ ట్రాక్ అవ్వకుండా simcard తీయడానికి ప్రయత్నించినా esim వల్ల ఆది సాధ్యం కాదు, కాబట్టి మనం. మన మొబైల్ ను find my device వంటి app లతో location ని track చేయొచ్చు.
🔚 చివరి మాట
2026లో Jio eSIM పోర్టింగ్ కొంచెం కఠినంగా అనిపించినా, overall గా ఇది మరింత సురక్షితమైన మరియు స్పష్టమైన ప్రక్రియ.
సరైన పద్ధతిలో చేయడం వల్ల రెండు రోజుల్లోనే నెట్‌వర్క్ మారిపోతుంది. ఇది ఎప్పటికప్పుడు సిమ్ కార్డ్ నెట్వర్క్ మార్చే వారికి చాలా ఉపయోగపడుతుంది. కాకపోతే ఇప్పుడు చాలామందికి దీని గురించి తెలియదు. కనీసం అవగాహన కూడా లేదు. కొత్త టెక్నాలజీలు వస్తున్న కొద్ది కొత్త మోసలు కూడా వస్తున్నాయి. దానికి అరికట్టడానికి కొత్త ప్రక్రియలు మనం అవలంబించాల్సి ఉంటుంది. ఇప్పుడు చాలామందికి అసలు esim అంటే అసలు తెలియనే తెలియదు కాబట్టి వాళ్ళందరికీ మన యూట్యూబ్ ఛానల్ మరియు వెబ్సైట్ ద్వారా అవగాహన కల్పించడమే మా తక్షణ లక్ష్యం. ఇండియాలో ఉన్న చాలా నెట్వర్క్స్ కూడా మనం esim గా మార్చుకోవచ్చు అయితే ప్రస్తుతం జియో మరియు ఎయిర్టెల్ యూజర్స్ ఎక్కువగా దీన్ని ఉపయోగిస్తున్నారు
ఈ పోస్ట్ మీకు సహాయపడితే తప్పకుండా ఇతరులకు కూడా ఉపయోగపడుతుంది.










