మనలో చాలా మంది phone slow అవుతున్నప్పుడు “అరే ఇదేం మొజూ?” అని కోపం వస్తుంది. కొత్తగా కొన్న phone కూడా కొన్నాళ్ల తరువాత slow అవుతుంది. ఈరోజు photos, reels, apps all phone మీదే కాబట్టి, కొంచెం lag వచ్చినా కూడా irritating గా అనిపిస్తుంది. అలా స్లో అయినప్పుడు మనకు వచ్చే కోపం అంతా ఇంత కాదు. మన కోపానికి హద్దులే ఉండవు.
కానీ నిజంగా phone ఎందుకు slow అవుతుంది? దీని వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటి? మనమే ఏమి చేస్తే phone మళ్లీ fast అవుతుంది? అనేది చాలా simple గా చర్చిద్దాం. మరి ఎందుకు లేటు స్టార్ట్ చేద్దాం.
1️⃣ Background apps silently RAM తింటుంటాయి
మనం పూర్తిగా close చేశాననుకున్న apps కూడా background లో run అవుతాయి. మనం ఓపెన్ చేసిన ఆప్స్ అలానే ఉంచేస్తాం క్లోజ్ చేయకుండా.
Instagram, WhatsApp, YouTube వంటివి RAM & battery ఎక్కువగా వాడేస్తాయి.
Phone slow అవ్వడానికి ఇదే ప్రధాన కారణం. అవి బ్యాగ్రౌండ్ లో రన్ అవుతూ మొబైల్ ని స్లో చేయడానికి అసలు కారణంగా మారుతాయి.
2️⃣ Storage almost full అవ్వడం
నీ storage 85–95% నిండిపోయినా phone కుదుటపడదు.
Photos, videos, WhatsApp media ఇవే storage ని ఎక్కువ తింటాయి. అవసరమైన ఫోటోలే ఉంచుకోండి అవసరం లేని ఫొటోస్ ఎప్పటికప్పుడు డిలీట్ చేసేయండి. కొన్నిసార్లు మనకి టెంపరేచర్ గా అవసరమయ్యే ఫొటోస్ ఏదైనా డాక్యుమెంట్స్ ఏదైనా పేపర్స్ ఫొటోస్ తీసుకొని ఉంచుకుంటాం అలాంటివి దాని అవసరం తీరిపోయే వెంటనే డిలీట్ చేసుకుంటే మంచిది ఎందుకంటే దాని వల్ల కూడా స్టోరేజ్ నిండిపోతుంది. Storage full అంటే phone కి “breathing space” లేకపోయినట్టే.
3️⃣ Cache & junk files build-up
Apps వాడినప్పుడు చిన్న చిన్న temporary files save అవుతాయి.
Weeks గడిచాక ఇవన్నీ కలసి పెద్ద junk అవుతాయి.
దీంతో apps open అవ్వడానికి delay వస్తుంది. ఈ క్లియర్ చేయడానికి ఇప్పుడు వస్తున్న మొబైల్స్ లో డిఫాల్ట్ గా in-built ఆప్స్ mobile తో ఆ యాప్స్ ని ఉపయోగించి మనం జంక్ ఫైల్స్ ని క్లియర్ చేయొచ్చు external apps install చేయాల్సిన అవసరం లేదు. దీనివల్ల మనం మొబైల్ ఫోన్ చాలా నెమ్మదించడం మరి గమనిస్తారు.
అయితే దానికి సొల్యూషన్ ఏంటంటే మీరు మన మొబైల్లో డిఫాల్ట్ గా ఫోన్ మేనేజర్ అని ఉంటుంది దాన్ని ఉపయోగించి మనం జంక్ ఫైల్స్ ని remove చేయొచ్చు లేదంటే మీరు ఏదైనా యాప్స్ ని ప్లే స్టోర్ నుండి ఇన్స్టాల్ చేసుకుని దాని ద్వారా కూడా మనం మన జంక్ ఫైల్స్ ని క్లియర్గా చేయొచ్చు మనం సీసీ క్లీనర్ లేదా స్టోరేజ్ క్లీనర్ వంటి apps ఉపయోగించి కూడా మన మొబైల్లో జంక్ ఫైల్స్ ని మనం రిమూవ్ చేయవచ్చు.
4️⃣ Unused apps quietly resources వాడటం
మనకు అవసరం లేని apps install చేసుకుని months పాటు అలాగే వదిలేస్తాం.
వాటి కారణంగా battery కూడా drain అవుతుంది, storage కూడా తింటుంది. అవసరం లేని ఆప్స్ ఎప్పటికప్పుడు తీసేయడం మంచిది. దానివల్ల ఫోన్లో స్టోరేజ్ మిగులుతుంది అలానే స్లో అవ్వకుండా ఉంటుంది.
5️⃣ Slow లేదా damaged SD card
Cheap SD cards phone speed ని నిజంగా slow చేస్తాయి.
Phone కి data read/write చేయడం కష్టమవుతుంది. తక్కువ price కి వచ్చే sdcard ఉపయోగించకపోవడం మంచిది. ఇది మీ మొబైల్ ని ఇంకా స్లో చేస్తుంది. తక్కువ ధర ఉన్న sd కార్డులు ఉపయోగించడం వల్ల మొబైల్స్ రావడమే కాకుండా దాంట్లో మీరు దాచుకున్న డేటా కూడా ఎప్పుడైనా పోగొట్టుకుని అవకాశం ఉంటుంది. వీలైనంతవరకు కొంచెం మంచి రకం మెమరీ కార్డులు ఉపయోగించడం మంచిది. ఎప్పుడైనా మొబైల్స్ లో చాలా స్టోరేజ్ ఇస్తున్నారు, ఒక నెల మీరు ఉపయోగించాలనుకుంటే నాసిరకం ఉపయోగించకండి.
6️⃣ Software updates skip చేయడం
Updates వలన phoneకి కొత్త optimizations వస్తాయి.
Update skip చేస్తే bugs అలాగే ఉంటాయి → performance పడిపోతుంది. ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం వల్ల మన మొబైల్లో స్పీడ్ గా పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే మన మొబైల్ కొన్నప్పుడు మొబైల్ లో ఉండే కొన్ని లాభాలు అప్డేట్స్ లో క్లియర్ చేస్తారు. కాబట్టి అప్డేట్స్ అన్నది మన మొబైల్ కి చాలా అవసరం.
7️⃣ Malware లేదా virus
Unknown websites నుంచి downloads చేస్తే వైరస్ వచ్చే chance ఎక్కువ.
ఇది battery, CPU, internetను ఎక్కువగా వాడుతుంది. కాబట్టి అవసరం లేని వెబ్సైట్లు ఓపెన్ చేయకండి అలాగ అందులో ఉన్న ఫైల్స్ డౌన్లోడ్ చేయకండి మీకు అవగాహన ఉన్న వెబ్సైట్ ని వీక్షించి అందులో డేటాను డౌన్లోడ్ చేసుకోండి. ముఖ్యంగా .apk extention తో ఉన్న files play store లో కాకుండా బయట websites లో అస్సలు డౌన్లోడ్ చేయకండి. అలా చేస్తే malware మీ మొబైల్ లోకి చొరబడుతుంది. కాబట్టి తక్షణమే అలా అంటే ఫైల్స్ ఉంటే నా మొబైల్ నుండి డిలీట్ చేయండి. నాది మీకు తెలియకుండా మీ మొబైల్ లో డేటాను దొంగలించే అవకాశం ఉంటుంది లేదా మొబైల్స్ slow అవుతోంది.
8️⃣ Phone overheating
Phone చాలా వేడెక్కితే processor slow అవుతాడు.
ఈ process ని thermal throttling అంటారు. వేడెక్కుతుంది అనిపిస్తున్నప్పుడు ఒక 10 నిమిషాలు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి మళ్లీ ఆన్ చేయండి దానివల్ల బ్యాక్ గ్రౌండ్ లో రన్ అవుతున్న Apps close అవుతాయి అన్ని సర్వీస్ లో క్లోజ్ అవుతాయి. మళ్లీ రీస్టార్ట్ చేసినప్పుడు మొబైల్ స్పీడ్ గా పని చేసే అవకాశం ఉంది.
9️⃣ Battery health తగ్గిపోవడం
3–4 సంవత్సరాల తర్వాత battery health down అవుతుంది.
దీంతో phone కూడా slow అవుతుంది. బ్యాటరీ ఎందుకు తగ్గిపోతుంది అటే మనం ఎప్పుడు కూడా 20% కి తక్కువ గాని 80% కి ఎక్కువ ఛార్జింగ్ చేయకూడదు. ఎలా ఈ రెండిటి మధ్య చార్జింగ్ Maintain చేస్తే మన బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది. బ్యాటరీ మీద ఒత్తిడి తగ్గుతుంది కాబట్టి. నేను గత ఐదు సంవత్సరాలుగా నా మొబైల్ యొక్క బ్యాటరీని నేను ఈ పద్ధతిలో ఉపయోగించడం వల్ల నాకు ఇప్పటికీ అప్పటికీ ఎటువంటి బ్యాటరీలో హెచ్చుతగ్గుల మార్పులు రాలేదు, చార్జింగ్ బ్యాకప్ తక్కువగా రావడం వంటివి అసలు నాకు దరి చేరలేదు. ఎప్పటికీ నా మొబైల్ ని నేను బ్యాటరీ చాలా తొందరగానే చాట్ అవుతుంది అలానే బ్యాటరీ లైఫ్ కూడా ఎక్కువగానే వస్తుంది. అలానే ఎప్పుడైనా ఉపయోగిస్తున్నప్పుడు మొబైల్ ఎక్కువగా వేడెక్కడం మీరు గమనిస్తే వెంటనే స్విచ్ ఆఫ్ చేయండి ఒక 15 నిమిషాల తర్వాత చల్లారిన తర్వాత మళ్ళీ స్విచ్ ఆన్ చేయండి ఇది తరచుగా కాకుండా అప్పుడప్పుడు ఇలా చేయడం వల్ల కూడా బ్యాటరీ మన్నిక వస్తుంది. ఎందుకంటే బ్యాటరీ ఎక్కువగా వీడు వేడెక్కడం వల్ల దాంట్లో ఉన్న సెల్ల్స్ పాడవడం జరుగుతుంది మన స్విచ్ ఆఫ్ c చేయడం వల్ల అది చల్లబడుతుంది, ఇలా చేయడం వల్ల దాన్ని మనం అరికట్టవచ్చు.
🔟 Heavy wallpapers, themes, animations
Live wallpapers & fancy themes phone resources ఎక్కువగా వాడుతాయి. మామూలు వాల్ పేపర్లు పెట్టుకుంటే మంచిది. దానివల్ల మన మొబైల్ లో చార్జింగ్ కూడా ఆదా అవుతుంది. Animated wallpaper పెట్టుకోవడం వల్ల బ్యాటరీ త్వరగా అవ్వడమే కాకుండా ఫోన్ కొంచెం శివ అయిపోతుంది. మొబైల్ లో ఇచ్చే static వాల్ పేపర్ పెట్టుకోవడం మంచిది లేదా ఫొటోస్ పెట్టడం మంచిది. దీనివల్ల బ్యాటరీ కొంచెం ఎక్కువ సమయం వస్తుంది.
⭐ Phoneని మళ్లీ FAST చేయాలంటే? (2026 Practical Tips)
✔ 1. Background apps close చేయండి
✔ 2. Storage లో కనీసం 20% free ఉంచండి
✔ 3. Weekly once cache clean చేయండి
✔ 4. Unused apps uninstall చేయండి
✔ 5. Weekly restart చేయండి
✔ 6. Phone heat అవకుండా చూసుకోండి
✔ 7. Lite apps వాడండి
✔ 8. Latest updates install చేయండి
✔ 9. Virus scan చేయండి
✔ 10. చివరి chance → Factory reset (backup తప్పనిసరి)
ఈ పైన చెప్పిన పద్ధతులు పాటిస్తే ఖచ్చితంగా మొబైల్ పనితీరులో మార్పు కనిపిస్తుంది. ఏదైనా మనం వాడే విధానంలోనే దాని వేగం ఆధారపడి ఉంటుంది. కానీ ఫ్యాక్టరీ రీసెట్ చేసే ముందు మీ డేటా ని బ్యాకప్ చేసుకుంటే మంచిది లేదంటే ముఖ్యమైన ఫోటోలు వీడియోస్ అలానే మిగిలిన ఫైల్స్ మళ్లీ రికవరీ చేయలేరు
ముగింపు
Phone slow అవ్వడం common కానీ permanent కాదు. కేవలం regular maintenance చేస్తే phone 2–3 years వరకూ smooth గా పని చేస్తుంది.మన మొబైల్ స్లో అవ్వడానికి మనమే కారణం అవుతాం అది గుర్తుపెట్టుకోండి. మొబైల్ ఉపయోగించే విధానం మారేటప్పుడే మొబైల్ పనితీరు కూడా మారుతుంది. మొబైల్ స్పీడ్ గా పని చేయాలంటే మనం కొన్ని చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది. బ్యాటరీ కొంచెం వేడెక్కినప్పుడు వాడడం ఆపేస్తా కాసేపు తర్వాత వాడండి స్విచ్ ఆఫ్ చేసి మళ్లీ ఆన్ చేస్తే performance బాగుంటుంది. నేను ఇప్పుటివరకు చెప్పిన టిప్స్ పాటించడం వల్ల నా మొబైల్ చాలా స్పీడ్ గా పని చేస్తుంది. దాని వల్ల మీకు కూడా ఉపయోగపడుతుందని ఈ ఆర్టికల్ రాశాను.
మనం కొంచెం జాగ్రత్తగా ఉపయోగించుకుంటే మొబైల్ లైఫ్ పెరుగుతుంది. Phone మన చేతిలో చిన్న computer లాంటిదే కాబట్టి, కొద్దిగా care ఇస్తే మళ్లీ కొత్త phone speed తో పని చేస్తుంది.
Also Read : WhatsApp Update: మెసేజ్ Edit చేయడానికి ఇప్పుడు పూర్తి 1 గంట టైమ్!










2 thoughts on “Phone ఎందుకు Slow అవుతుంది? ఎలా Fast చేయాలి? – Simple & Practical 2026 Guide”