Malware అంటే ఏమిటి? మొబైల్‌లో వైరస్ వచ్చిందా చెప్పే 7 నిజమైన లక్షణాలు

ఇప్పటి రోజుల్లో మనం ఫోన్‌ను ఎంతగా వాడుతున్నామో చెప్పాల్సిన అవసరం లేదు. Payments, photos, chats, shopping అన్నీ ఫోన్‌లోనే. అలా ఉండగా మొబైల్‌లోకి Malware వచ్చేస్తే మన data మొత్తం ప్రమాదంలో పడిపోతుంది. మన మొబైల్లో ఉండే డేటా వేరే వాళ్ళకి వెళ్లే అవకాశం ఉందన్నమాట. అలా రాకుండా ఉండాలంటే ఫస్ట్ మనం Malware అంటే  ఏంటో తెలుసుకోవాలి. కాబట్టి Malware అంటే ఏమిటి? మన ఫోన్‌కు వైరస్ వచ్చిందని ఎలా తెలుసుకోవాలి? అన్న సందేహాలు ప్రతి smartphone user కి రావడం సహజం. అది మన మొబైల్ ని ఏ విధంగా నష్టం కలిగిస్తుంది, మన డేటా ఏ విధంగా దొంగలిస్తారు, అసలు ఆ డేటాతో వాళ్ళు ఏం చేస్తారు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో మనం తెలుసుకుందాం.

మొదటిగా Malware అంటే “Malicious Software” అంటే మనకు హాని చేసే app లేదా code. ఇది ఫోన్‌లోకి వచ్చాక మన activities track చేయడం, ads show చేయడం, data దొంగిలించడం, battery drain చేయడం, banking వివరాలు తీసుకోవడం వరకు చేస్తుంది. మన మొబైల్ మన ఆధీనంలో లేకుండా పనిచేయడం జరుగుతుంది. ఇప్పుడు virus వచ్చిందని చెప్పే 7 clear signs చూద్దాం.


1️⃣ ఫోన్ చాలా అసహజంగా slow అవ్వడం

సాధారణంగా బాగానే పనిచేసిన phone ఒక్కసారిగా lag అవుతూ, apps open అవ్వడానికి ఎక్కువ టైం తీసుకుంటే background లో ఏదో unwanted process run అవుతున్నట్టే. అలానే మనం వాడుతున్న ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఎక్కువ అవుతుంది అంటే అలాంటప్పుడు బ్యాక్ గ్రౌండ్ లో మన ఇంటర్నెట్ కూడా రన్ అవుతుంది అని అర్థం. మన మొబైల్ డేటా కూడా డైలీ యూజెస్ కంటే కొంచెం ఎక్కువ అవుతుందంటే background లో మనకి తెలియకుండా డేటా కన్జెన్సన్ కూడా అవుతుంది.

మనం ప్రతిరోజు వాడిందానికంటే ఎక్కువ డేటా మనకి తెలియకుండా consume అవ్వడం జరుగుతుంటే దానిని కూడా  మనం మాల్వరు వచ్చిందని అనుమనించాల్సిందే. అలానే మొబైల్ వేడెక్కడం, lag అవ్వడం, మన ప్రమోయం లేకుండా apps open అవ్వడం వంటివి కూడా malware వల్లే జరగడం అవుతుంది.


2️⃣ Battery ఒకేసారి వేగంగా తగ్గిపోవడం

మీ usage మారకపోయినా battery drain వేగంగా జరిగితే, malware background లో పనిచేసే అవకాశం ఎక్కువ. బ్యాటరీ త్వరగా అయిపోతుందంటే మనకు తెలియకుండా ఏదో ఒక యాప్ అనేది బ్యాటరీని drian చేస్తుంది అంటే అది మనకు తెలియకుండా రన్ అవుతుంది. ఇలా ఆకస్మాత్తుగా బ్యాటరీ వాడకంలో మార్పులు వచ్చిన సరే మన మొబైల్లో ఉందని మనం అంచనా వేయవచ్చు. కానీ అది బ్యాటరీ పాడవడం వల్ల జరిగింది అని మీరు దాన్ని నిర్లక్ష్యం చేస్తే తర్వాత జరిగే పరిణామాలకి బాధ్యత మనమే వహించాలి. కాబట్టి మనకి తెలియకుండా జరిగే కొన్ని చిన్న చిన్న మార్పులను దృష్టిలో ఉంచుకుంటే మంచిది.

మనం చార్జింగ్ పెట్టే విధానంలో సరిగ్గా లేకపోయినా కూడా బ్యాటరీ చార్జింగ్ తగ్గుతుంది అలానే అది చార్జింగ్ పద్ధతి బాగోలేక పోవడం వల్ల జరుగుతుందా లేకపోతే మన మొబైల్లో మాల్ వేరు ఉండడం వల్ల జరుగుతోందా అనేది మనం పసిగట్టాలి. దాని బట్టి ఒక మనం ఒక అంచనా వేసుకోవచ్చు, తర్వాత తదుపరి చర్యలను తీసుకోండి.


3️⃣ Internet data అతి ఎక్కువగా వాడబడటం

మీరు ఎక్కువగా ఏమీ చేయకపోయినా data usage spikes కనిపిస్తే, malware secret‌గా internet ని ఉపయోగిస్తున్నట్లే. ఒకవేళ మనం మామూలు డేటా turn off చేసిన మళ్లీ ఆన్ చేసినప్పుడు మనకు తెలియకుండా మళ్ళీ డేటా యూజెస్ పెరుగుతుంది. మనం ఏమి వాడికి పోయినా మొబైల్ డేటా యూస్ పెరుగుతుందంటే దానికి అర్థం కూడా మాల్వేర్ ఉందని అంచనా వేయవచ్చు.

సాధారణంగా background consumption మన ప్రమోయంతో జరగాలి, అలా కాకుండా మన ప్రమోయం లేకుండా జరుగుతుంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని గమనించి తదుపరి చర్యులు తీసుకోండి. ఎప్పటికప్పుడు మొబైల్ అప్డేట్ చేస్తూ ఉండండి. సో మన ఇంటర్నెట్ ఎంత వరకు ఉపయోగిస్తున్నాము అన్నిటిని మనం సెట్టింగ్స్లో చూసుకోవచ్చు ఎప్పటికప్పుడు చూసుకోవాలి అందులో ఏ యాప్ ఎక్కువగా ఉపయోగిస్తుందో చూడాలి. మనం ఎక్కువగా ఉపయోగించిన లేదంటే కొత్త యాప్ ఇంటర్నెట్ ఉపయోగించడం మీద అక్కడ చూసినట్టుకుంటే వెంటనే దాన్ని మీరు అన్ ఇన్స్టాల్ చేయండి, మాల్వేర్ అనేది ఆప్ రూపంలోనే ఉంటుంది, మాల్వేర్ అంటే యాప్ లో ఒక ప్రత్యేకమైన కోడ్ మాత్రమే.

gemini-ai-photo-prompts
Gemini AI Photo Prompts (Copy Paste) – Trending Images Create చేయడానికి Complete Guide

4️⃣ Randomగా ads, pop-ups రావడం

Browser లో కాకుండా mobile home screen మీద కూడా ఎక్కడో అక్కడ ads వస్తుంటే → అది adware అని almost 100% చెప్పొచ్చు. ఏదైనా యాప్ ఓపెన్ చేసిన క్లోజ్ చేసినా మనకు తెలియకుండానే ఏదో ఒక యాడ్ డిస్ప్లే అవుతుంటే మన మొబైల్ లో మాల్వేర్ ఉన్నట్టు మనం అనుకోవచ్చు. కాబట్టి మనకి అవసరమైన ఆప్స్ మాత్రమే ఉపయోగించుకోవడం మంచిది. అవసరం లేని ఆప్స్ ఉంచడం వల్ల అది మన మొబైల్ కి ఇబ్బంది పెడుతుంది.

యాడ్స్ తరచుగా వస్తుంటే దాన్ని సాధారణంగా తీసుకోకండి ఎందుకంటే గూగుల్ ప్రతిసారి మనకి యాడ్స్ చూపించదు మనకి తెలియకుండా అవసరం లేని ఆప్స్ మాత్రమే ఇలాంటి యాడ్స్ వస్తుంటాయి. మొబైల్ లో యాడ్స్ చూపించే ఆ యాప్ ని వెతికి uninstall చేయండి,  లేదా మీ డేటాని బ్యాకప్ చేసుకుని ఫోన్ రిసిప్ట్ చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది. యాడ్స్ వచ్చే యాప్స్ ఏమైనా ఉంటే దాన్ని తీసివేయడమే మంచిది.


5️⃣ మీరే install చేయని apps కనిపించడం

మీ phone లో కొత్త apps కనిపిస్తే, అది dangerous signal. Malware ఇలానే fake apps install చేస్తుంది. మీరు ఏ Apps Install చేశారా, లేదా అనేది మీకు మాత్రమే తెలుస్తుంది మీరు Install చేయని యాప్స్ ఉంటే వెంటనే దాన్ని Uninstall చేసేయండి. ప్లే స్టోర్ లో తప్ప బయట వేరే బ్రౌజర్ లో దొరికే ఆప్స్ ఎప్పుడు కూడా Install చేయకూడదు. బయట దొరికే ఆప్స్ చాలా ప్రమాదకరం. అది మన మొబైల్లో చేసే టాస్కులు మనకు విసిగించడమే కాకుండా మనకి హానికారం చేయడమే కాకుండా మన డేటాని దొంగలించ అవకాశం ఎక్కువగా ఉంటుంది.

మీరు ఎన్ని యాప్స్ ఇన్స్టాల్ చేశారు అన్నది మనం మన సెట్టింగ్స్లో ఆప్స్ అనే ఆప్షన్లో చూడొచ్చు, అవసరం లేని అక్కనుండి మనం uninstall చేయొచ్చు. అలానే అక్కడ ఉన్న ఆప్స్ ఒక్కొక్క యాప్ ఏ పెర్మిషన్ తీసుకుంటుందో కూడా మీరు అక్కడ తీసుకోవచ్చు, ఒక యాప్ అవసరం లేని సార్ తీసుకుంటే దాన్ని రిమూవ్ చేయండి.


6️⃣ ఫోన్ వేడెక్కిపోవడం (Overheating)

సాధారణ apps open చేసినా ఎంతకైనా వేడి పెరిగిపోతుంటే, background లో virus CPU ని ఎక్కువగా వాడుతున్నట్టు ఉంటుంది. ఫోను తరచుగా వేడెక్కుతుంటే లేదా మీకు తెలియకుండా కొన్ని యాప్స్ ఓపెన్ అవడం క్లోజ్ అవ్వడం జరుగుతుంటే మన మొబైల్లో మాల్వేర్ ఉందని అంచనా వేసుకోవాలి. వెంటనే అవసరం లేని ఆప్స్ అనే uninstall చేసేయండి.

మన మొబైల్ ఎక్కువగా ఉపయోగించడం వలన వేడి అయితే పర్వాలేదు, కానీ మనకు తెలియకుండానే ఉన్నట్టుండి మొబైల్ వేడెక్కుతుంటే మీరు దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు తరుపున తీసుకోవాలి, ఒకసారి ఎప్పటికప్పుడు మీ మొబైల్ లో కొత్త యాప్స్ ఉన్నాయో లేదో చూసుకోండి ఉంటే అది మీరే ఇన్స్టాల్ చేశారా లేదా అనేది గమనించాలి.


7️⃣ ఫోన్ “తానే” ఏదో చేస్తున్నట్టుగా అనిపించడం

Apps auto-open అవ్వడం, screen scroll అవ్వడం, random clicks ఇవి malware ఉన్నప్పుడు ఎక్కువగా జరుగుతాయి. ఇలా జరుగుతుంటే మీ మొబైల్ ప్రమాదంలో ఉందని అర్థం, దీనివల్ల మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు కూడా పోయే అవకాశం ఉంటుంది. మీరు వెంటనే మీరు Alert అవ్వాల్సి ఉంటుంది. మీరు బ్యాంకింగ్ యాప్స్ ఉపయోగిస్తుంటే ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఎలాంటి స్క్రీన్ మూవింగ్ జరుగుతున్నప్పుడు మీరు రక్షణ చర్యలు తీసుకోవాలి లేదంటే మీ అకౌంట్లో ఉండే డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. కొన్ని స్క్రీన్ షేరింగ్ ఆప్స్ మీ మొబైల్ లో ఉంటే దాని యొక్క ఐడీలను ఎవరికి ఇవ్వొద్దు. Anydesk, TeamViewer వంటే ఆప్స్ మీరు ఉపయోగిస్తున్నట్టయితే దానిమీద ఒక కన్ను వేయండి ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండండి వేరే వాళ్ళకి ఐడి ఇచ్చారా లేదా మీరు గుర్తు తెచ్చుకోండి. మీదను ఉపయోగించకపోతే దాన్ని తీసివేయడం మంచిది.


Malware ఫోన్‌లోకి ఎలా వస్తుంది?

మీ మొబైల్ లోకి ఈ కింది విధంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి

Android 15 privacy dashboard update
Android 15 కొత్త Privacy Dashboard – మీ Mobile లో ఏ App ఏ Data వాడుతోందో ఇప్పుడు పూర్తిగా తెలుస్తుంది!
  • Pirated / modded APKలు
  • Unknown websites
  • Free VPNలు
  • Fake app boosters
  • Spam links & messages

ఇప్పుడు ఆన్లైన్లో చాలా స్కామ్స్ మరియు ఫ్రీ ఆఫర్స్ అని చాలా మోసాలు జరుగుతున్నాయి వాళ్లు అలా ఆశ చూపించి మన మొబైల్ లోకి మాల్వేర్ ని పంపిస్తున్నారు.


Virus ఉందని అనిపిస్తే ఏమి చేయాలి?

✔ Unknown apps uninstall చేయండి
✔ Chrome → Clear data + Reset site settings
✔ Play Protect ON చేయండి
✔ Trusted antivirus తో scan చేయండి
✔ అవసరమైతే బ్యాకప్ తీసుకుని factory reset చెయ్యండి

మీరు ఫ్యాక్టరీ రీసెట్ చేసే ముందు మీ మొబైల్ లో ఇంపార్టెంట్ ఫొటోస్ వీడియోస్ ఉంటే ముందుగానే వేరే మొబైల్ లోకి కాపీ చేసుకోండి. అలాగే కాపీ చేసేటప్పుడు వేరే అవసరం లేని ఫైల్స్ కాపీ చేయవద్దు అందులో మాల్వేర్ ఉండే అవకాశం ఉంటుంది. నీకు అవగాహన లేకపోతే యూట్యూబ్లో చాలా వీడియోస్ అందుబాటులో ఉన్నాయి దాంట్లో చూసి దాని తగ్గట్టుగా మీరు చర్యలు తీసుకోండి.


ముగింపు

Malware అనేది చిన్న విషయం కాదు కానీ భయపడాల్సిన అవసరంలేదు. Signs తెలుసుకుని వెంటనే action తీసుకుంటే మీ mobile మరియు personal data పూర్తిగా safe గా ఉంటుంది. ఎప్పుడూ trusted apps మాత్రమే వాడటం, unknown links avoid చేయడం ఇవి మీ online safety ని strongly protect చేస్తాయి. కాబట్టి మన మొబైల్ వాడుతున్నాం అందులో ఎంతో కొంత అవగాహనతో ఉంటే మనం ఎలాంటి Malware నుండి తప్పించుకోవచ్చు. టెక్నాలజీకి తగ్గట్టుగా మనం కూడా కొన్నింటిపై అవగాహన కలిగించుకోవాలి, ఎక్కువగా మోసాలు అవగాహన లేకపోవడం వల్ల జరుగుతుంది.

Also Read : iBomma అంటే ఏమిటి? ఎందుకు ప్రమాదకరం? Safe Alternatives

Santosh

Hi everyone, I'm Santosh, the creator and writer behind this blog. I share valuable insights and information on topics like Blogging, SEO, Internet trends, Reviews, WordPress, Online Earning, News, and Technology right here on this platform.

Leave a Comment