Mobile Charging Mistakes: మీ Phone Battery Life తగ్గడానికి కారణమయ్యే తప్పులు

Introduction

ప్రస్తుతం Smartphone మన daily life లో చాలా important అయిపోయింది. Calls, photos, videos, online payments, social media, entertainment ఇలా చాలా పనులకు మనం phone మీద depend అవుతున్నాం. Mobile Charging Mistakes.

కానీ కొత్తగా mobile కొన్నప్పుడు battery backup చాలా బాగుంటుంది . కొన్ని months లేదా years తర్వాత battery fast ga drain అవ్వడం, charging slow అవ్వడం, phone heat అవ్వడం లాంటి problems చాలామంది face చేస్తారు.

చాలామంది దీనికి phone company లేదా battery quality మాత్రమే reason అనుకుంటారు. కానీ నిజానికి మనం daily చేసే కొన్ని చిన్న చిన్న charging mistakes కూడా battery life మరియు performance మీద impact చూపించే అవకాశం ఉంటుంది.

నేను కూడా గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని simple charging habits follow చేస్తున్నాను. నా Realme phone ని 2020 లో కొనుగోలు చేశాను, ఇప్పటికీ daily usage లో battery performance లో పెద్దగా difference గమనించలేదు.

ప్రతి phone usage వేరుగా ఉంటుంది కానీ కొన్ని basic tips follow చేస్తే battery health ని కొంతవరకు maintain చేసుకోవచ్చు.

ఈ article లో smartphone battery life తగ్గడానికి కారణమయ్యే common mistakes ఏంటి? అలాగే battery ఎక్కువ రోజులు బాగా ఉండడానికి ఏం చేయాలో తెలుసుకుందాం.

Smartphone Battery ఎలా Work అవుతుంది?

ప్రస్తుతం ఎక్కువ smartphones లో Lithium-ion batteries use చేస్తున్నారు. ఇవి పాత batteries తో compare చేస్తే fast charging support చేస్తాయి మరియు మంచి performance ఇస్తాయి.

కానీ ఏ battery అయినా permanent కాదు. ప్రతి battery కి కొన్ని charging cycles ఉంటాయి. మనం phone charge చేయడం మరియు use చేయడం వల్ల time తో battery capacity కొద్దిగా తగ్గుతుంది.

ఈ charging cycles గురించి మనం ఎక్కువగా worry అవ్వాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని మంచి charging habits follow అయితే battery cells మీద unnecessary stress తగ్గించి battery performance ని better గా maintain చేయవచ్చు.

దీనికోసం పెద్దగా technical knowledge అవసరం లేదు. కొంచెం అవగాహన ఉంటే చాలు.

1. Battery 0% అయ్యే వరకు Phone Use చేయడం

చాలామంది చేసే common mistake ఏంటంటే phone battery పూర్తిగా అయిపోయే వరకు use చేస్తారు.

Battery 1% రావడం లేదా phone switch off అయిన తర్వాత మాత్రమే charging పెడుతుంటారు.

అప్పుడప్పుడు ఇలా జరిగితే పెద్ద problem కాదు. కానీ regular గా ఇలా చేయడం battery మీద extra stress create చేసే అవకాశం ఉంటుంది.

కొంతమంది time దొరికితే చాలు mobile చూస్తూనే ఉంటారు. Battery ఎంత ఉంది అని కూడా పట్టించుకోరు.

నా suggestion అయితే battery 20% దగ్గరికి వచ్చినప్పుడు charging పెట్టుకోవడం better. చివరి 1–2% వరకు wait చేయాల్సిన అవసరం లేదు.

అలాగే battery చాలా low గా ఉన్నప్పుడు heavy usage, long calls, gaming లాంటివి తగ్గించడం మంచిది.

2. Duplicate Chargers Use చేయడం

Original charger damage అయిన తర్వాత చాలామంది market లో దొరికే cheap chargers కొనుగోలు చేస్తారు.

Google Account Hack
Google Account Hack అయితే వెంటనే ఏం చేయాలి? Complete Recovery Guide

కానీ quality లేని chargers లో proper power control లేకపోవచ్చు. దీని వల్ల phone heating issues లేదా charging problems వచ్చే అవకాశం ఉంటుంది.

కొంతమంది charger కోసం extra money spend చేయడం ఎందుకు అని ఆలోచిస్తారు. కానీ ₹10,000 లేదా అంతకంటే ఎక్కువ విలువైన mobile battery health కోసం మంచి charger use చేయడం better.

ఒకవేళ emergency లో వేరే charger use చేయాల్సి వస్తే temporary గా okay. కానీ long term use కోసం original లేదా trusted brand charger తీసుకోవడం మంచిది.

Quality charger use చేయడం వల్ల battery performance ఎక్కువ కాలం maintain అయ్యే అవకాశం ఉంటుంది.

3. Charging పెట్టి Heavy Usage చేయడం

Charging పెట్టినప్పుడు phone use చేయడం చాలా common habit.

Normal chatting లేదా small usage పెద్ద issue కాకపోవచ్చు. కానీ charging లో ఉన్నప్పుడు ఎక్కువసేపు gaming, video editing లేదా heavy apps use చేస్తే phone temperature increase అవుతుంది.

Battery health విషయంలో heat ఒక important factor.

అందుకే charging సమయంలో phone ఎక్కువ heat అవుతుంటే కొంతసేపు rest ఇవ్వడం మంచిది.

అలాగే battery చాలా తక్కువగా ఉన్నప్పుడు GPS, gaming లాంటి ఎక్కువ power తీసుకునే services continuous గా use చేస్తే battery fast drain అవుతుంది.

Usage ని battery level బట్టి manage చేస్తే single charge లో కొంచెం extra backup పొందవచ్చు.

4. Phone Heating ని Ignore చేయడం

Mobile battery life మీద heat ఎక్కువ impact చూపిస్తుంది.

Phone ని direct sunlight లో పెట్టడం, charging పెట్టి pillow లేదా bed కింద ఉంచడం avoid చేయాలి.

Phone charge అవుతున్నప్పుడు heat బయటకు వెళ్లేలా normal place లో ఉంచడం better.

Phone ఎక్కువగా heat అయినప్పుడు కొంతసేపు use చేయకుండా ఉంచితే temperature normal అవుతుంది.

నేను సాధారణంగా phone heat అయితే కొంత time పక్కన పెట్టేస్తాను. అవసరం అయితే కొన్ని minutes switch off చేయడం కూడా help అవుతుంది.

Background apps లేదా outside temperature వల్ల కూడా phone heat అయ్యే అవకాశం ఉంటుంది.

5. Always 100% Charge చేయాలి అనుకోవడం

చాలామందికి phone battery ఎప్పుడూ 100% ఉండాలి అనే habit ఉంటుంది.

iqoo z11x 5g has launched in india
iQOO Z11x 5G భారత్‌లో లాంచ్ అయ్యింది – నిజంగా కొనడానికి విలువ ఉందా?

Present smartphones charging ని smart గా manage చేసినా కూడా ప్రతిసారి 0 నుంచి 100% వరకు charge చేయాల్సిన అవసరం లేదు.

Battery ని సాధారణంగా 20% నుంచి 80-90% మధ్యలో maintain చేయడం మంచి habit గా చాలామంది follow చేస్తారు.

అయితే travel లాంటి situations లో full charge చేసుకోవడంలో problem లేదు. కానీ daily normal usage లో balanced charging maintain చేయవచ్చు.

6. Background Apps Check చేయకపోవడం

Battery fast ga drain అయితే చాలామంది battery problem అనుకుంటారు.

కానీ కొన్ని apps background లో continuously run అవుతూ battery consume చేస్తాయి.

మనం ఒక app open చేసి minimize చేస్తాం. అలా చాలా apps background లో ఉండిపోతాయి.

అవసరం లేని apps recent apps నుంచి close చేయడం, battery usage settings check చేయడం వల్ల unnecessary battery usage తగ్గించవచ్చు.

Settings లో Battery Usage option ద్వారా ఏ apps ఎక్కువ power తీసుకుంటున్నాయో తెలుసుకోవచ్చు.

Battery Life Improve చేయడానికి Useful Tips

  • Phone software updates time కి install చేయండి
  • అవసరం లేని apps remove చేయండి
  • Quality charger use చేయండి
  • Phone ఎక్కువ heat కాకుండా చూసుకోండి
  • Battery saver features అవసరమైనప్పుడు use చేయండి
  • Background running apps check చేయండి

నేను ఈ చిన్న చిన్న tips గత కొన్ని సంవత్సరాలుగా follow చేస్తున్నాను. నా usage ప్రకారం battery performance బాగానే maintain అవుతుంది.

అలాగే internet లో available గా ఉన్న battery related information నుంచి కూడా కొన్ని మంచి habits తెలుసుకొని follow చేయడం ఉపయోగపడుతుంది.

Conclusion

Smartphone battery ఎక్కువ కాలం బాగా రావాలి అంటే expensive phone కొనడం మాత్రమే కాదు. మనం phone ని ఎలా use చేస్తున్నాం, ఎలా charge చేస్తున్నాం అనేది కూడా important.

ఎక్కువ capacity ఉన్న battery ఉన్నా కూడా సరైన usage లేకపోతే performance తగ్గవచ్చు.

Daily చేసే చిన్న charging mistakes avoid చేసి, heat control చేసి, quality accessories use చేస్తే battery performance ని better గా maintain చేయవచ్చు.

Mobile కి main power source battery కాబట్టి దాన్ని care చేయడం చాలా important.

ఇలాంటి మరిన్ని useful tech tips కోసం మా website ని follow అవ్వండి.

Also Read: మీ Google Account Hack అయ్యిందా? ఈ 7 Steps వెంటనే Follow చేయండి

Santosh

Hi everyone, I'm Santosh, the creator and writer behind this blog. I share valuable insights and information on topics like Blogging, SEO, Internet trends, Reviews, WordPress, Online Earning, News, and Technology right here on this platform.

Leave a Comment