మన Android ఫోన్ లో ఎంత features ఉన్నాయో మనకే తెలియదు. రోజూ చేతిలోనే ఉంటుంది, కానీ phone లో దాచిపెట్టినట్టుగా ఉండే కొన్ని settings, shortcuts, tools ఇవి నిజంగా life easy చేసేస్తాయి. కొన్ని మనకు ఉపయోగపడవచ్చు పడకపోవచ్చు కానీ ఉపయోగం పడిన ట్రిప్స్ అనేవి మనకు అవగాహన లేకుండా అయిపోతుంది. మనం ఉపయోగించకపోవడం వల్లే అవి “hidden features” గా కనిపిస్తాయి. సో మనకు ఉపయోగపడి చేస్తుంది మనకు తెలియకపోవడం అనేది మనకి ఇబ్బంది ఇస్తుంది కొన్నిసార్లు. కానీ మనం మనకి తెలియని features ఉపయోగించకపోవడం వల్ల మనం చాలా miss అవుతాము. ఇప్పుడు వాటిలో చాలా మందికి తెలియని 15 useful features ఏవి, అవి ఎలా పని చేస్తాయి అన్నది simpleగా చెబుతున్నా.
1️⃣ Split Screen – రెండు పనులు ఒకేసారి
YouTube చూస్తూ WhatsApp reply చెయ్యాలి అంటే ఇదే best.
Screenను రెండు భాగాలుగా split చేసి రెండు apps ని parallelగా వాడొచ్చు. Work + entertainment combo!. దానివల్ల మనం యూట్యూబ్ వీడియోస్ చూస్తూ చాటింగ్ చేసుకోవచ్చు అలానే వేరే app కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది నాకు చాలా బాగా ఉపయోగపడింది ఎందుకంటే కొన్నిసార్లు నేను మూవీ చూస్తూ అప్పుడప్పుడు వాట్సాప్ లో రిప్లై ఇవ్వాల్సి వచ్చేది అలాంటప్పుడు నాకు ఈ ట్రిక్ చాలా ఉపయోగపడింది అలానే నా ఫ్రెండ్స్ కి కూడా చెప్పడం జరిగింది.
2️⃣ App Drawer Search – apps కోసం scroll చేయాల్సిన పనిలేదు
App drawer ఓపెన్ చేసి ఒకసారి swipe down చేస్తే search bar కనిపిస్తుంది.
ఏ app అయినా పేరు టైప్ చేస్తే వెంటనే కనిపిస్తుంది. పెద్ద app list ఉన్నవాళ్లకి చాలా useful. ఈ option వల్ల మనకి సగం తపనొప్పి తగ్గుతుంది. మన మొబైల్ లో వందల యాప్స్ ఉపయోగిస్తుంటాం మనకు కావాల్సిన యాప్ కోసం వెతికితే సగం టైం పడుతుంది, నేనైతే ఫోన్ పే యాప్ వెతకాలంటే ఎక్కడో కిందకి వెళ్లి ఆ యాప్ ని పేరు టైప్ చేసి పేమెంట్ చేసినప్పటికీ ఎక్కువ సమయం తీసుకుంటున్నాను అదే ఈ ఆప్షన్ వల్ల డైరెక్ట్ గా మనకు కావాల్సిన యాప్ ని search bar లో టైప్ చేస్తే మనకు ఆ యాప్ వెంటనే దొరుకుతుంది వెంటనే పని పూర్తి అవుతుంది. నేను ప్రతిరోజు ఉపయోగించే hidden ట్రిక్స్ లో ఎక్కువగా ఉపయోగించేది ఇదే.
3️⃣ Screen Pinning – phone ఎవరికిచ్చినా safe
Kids కి YouTube ఇవ్వాలంటే లేదా friend కు ఒక photo చూపించాలంటే, వారు ఇతర apps చూడకుండా ఈ feature help అవుతుంది. దీనివల్ల మనం ఏ యాప్ అయితే పింక్ చేసి వాళ్ళకి ఇస్తాము ఆ ఒక యాప్ మాత్రమే వాళ్ళు ఉపయోగించగలరు వేరే యాప్ ఉపయోగించడానికి అవకాశం అస్సలు ఉండదు, అదే ఈ టీచర్ ఎక్కువగా ఉన్న అసలు పని.
ఒక app ని pin చేస్తే అదే screen లో lock అవుతుంది. ఇది ఎక్కువగా పేరెంట్స్ ఉపయోగపడుతుంది. అలానే మొబైల్ లో సీక్రెట్స్ maintain చేసేవారికి ఇది మంచి ఫీచర్. సీక్రెట్స్ maintian చేసే వాళ్ళకి ఇది ఒక పెద్ద వరం అని చెప్పవచ్చు ఎందుకంటే వాళ్లకు భద్రత దృశ్య ఈ యాప్ చాలా బాగా ఉపయోగపడుతుంది.
4️⃣ Smart Lock – password repeatedly టైప్ చేయాల్సిన పని లేదు
House, office, trusted Bluetooth devices దగ్గర phone auto-unlock అవుతుంది.
Daily usage లో ఇది చాలా convenient. ఎక్కువసార్లు మొబైల్ వాడుతూ మళ్ళీ pocket లో పెట్టడం మళ్ళీ use చేయడం ఇలా వాడేవారు ఇంట్లో ఉన్నప్పుడు ఈ ఫీచర్ బాగా use అవుతుంది. మనం ప్రతిరోజు వందలసార్లు లాక్ మరియు అన్లాక్ చేస్తుంటాం దాని కౌంట్ మనం చూసినట్లయితే అది వందలు దాటి ఉంటుంది ఎందుకంటే మనం తరుచుగా మా మొబైల్ ఉపయోగిస్తూ మళ్లీ pocket లో పెట్టుకుంటూ ఉంటూ ఉంటాం. అలాంటి వాళ్లకి ఈ ఫీచర్ చాలా బాగా ఉపయోగపడుతుంది.
ఇది ఎలా పని చేస్తుందంటే మనకు కొన్ని లోకేషన్స్ లేదంటే కొన్ని డివైసెస్ లో ఉపయోగించినప్పుడు లాక్ పడడం జరగదు దానివల్ల మన మొబైల్ ఓపెన్ చేసిన వెంటనే సాధారణంగా ఓపెన్ అవుతుంది పదేపదే ఒక నిర్ధిష్ట ప్రదేశాలలో వాడేటప్పుడు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఎక్కువ సమయం పనిచేసే ప్రదేశాల్లో ఇలా పెట్టుకోండి. నేను ఇంట్లో ఉండేటప్పుడు ఈ ఆప్షన్ పెట్టుకున్నాను ఎందుకంటే ఇంట్లో పదేపదే లాక్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు.
5️⃣ One-Hand Mode – పెద్ద ఫోన్‌లకు perfect
ఇప్పటి phones ఒక చేతితో operate చేయడం కష్టం.
One-hand mode లో screen చిన్న అవుతుంది → thumb తో మొత్తం control. ఇది ఎక్కువగా ఒకపని చేస్తూ మొబైల్ వాడేవారికి ఉపయోగపడుతుంది. ఎక్కువగా తింటూ మొబైల్ వాడేవారికి బాగుంటుంది.ఇది ఎప్పుడు మాకు బాగా ఉపయోగపడుతుందంటే కొందరు భోజనం చేస్తూ మొబైల్ మెసేజ్ చేసేవాల్లకి, అప్పుడే మనం ఒక మొబైల్ ని ఒక హ్యాండ్ తో టైప్ చేస్తూ ఉంటాం అలాంటప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుంది. నేనైతే తరచుగా కాకపోయినా అప్పుడప్పుడు ఈ ఫీచర్ నాకు ఉపయోగకరంగా ఉంటుంది.
6️⃣ Notification History – తొందరలో swipe చేసిన messages కూడా దొరుకుతాయి
Accidentally notification remove చేసేశాక regret అవుతుందా?
ఈ feature ON చేస్తే అన్ని notifications list గా save అవుతాయి. సో దీని వల్ల కూడా చాలా ఉపయోగం ఉంది ఎందుకంటే కొంతమంది వాట్సాప్ లో మెసేజ్ చేసింది డిలీట్ చేస్తారు తర్వాత మెసేజ్ మనం చూడలేం అలాంటివి నోటిఫికేషన్స్ హిస్టరీ లో అవి store అయ్యి ఉంటాయి. అక్కడికి వెళ్లి మనం చూసుకోవచ్చు అదే మా ఫ్రెండ్స్ అందరికీ చాలా బాగా ఉపయోగపడింది వాళ్ల ద్వారా నాకైతే ఇది తెలిసింది.
7️⃣ Live Transcribe – మాట్లాడింది text అవుతుంది
Meetings, classes, interviews ఏది అయినా మీరు మాట్లాడితే phone అది live గా text గా type చేస్తుంది.
Note-taking tension zero. ఆ టైప్ చేయడానికి కొంచెం ఇబ్బంది ఉన్న వాళ్ళు టైపింగ్ సరిగ్గా రాని వాళ్లకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలానే పని తొందరగా అవ్వాలన్నప్పుడు కూడా ఈ ఫ్యూచర్ ఇంకా ఉపయోగపడుతుంది. మీరు కచ్చితంగా ఉపయోగించుకుంటే నీ పని సమయమనేది తగ్గుతుంది. ఇది చాటింగ్ చేసావ్ అనుకోవడం బాగా ఉపయోగపడుతుంది.
8️⃣ Nearby Share – ఫైళ్ళు seconds లో share
Android users కి ఇది real AirDrop alternative.
WiFi + Bluetooth combine అవ్వడం వల్ల speed చాలా high. దగ్గర్లో ఉన్న వాటిని మనం తీసుకోవచ్చు. దీని వేగం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కొన్ని సమయాల్లో ఇది మనకు ఉపయోగిస్తుంటాం. ఎవరైతే ఎక్కువగా ఫైల్స్ ని షేర్ చేసుకుంటారో వాళ్ళకి ఏదో ఉపయోగపడుతుంది. మన మొబైల్లో డిఫరెంట్ గా ఉండడం వల్ల మనం ప్లే స్టోర్ నుండి వేరేగా యాప్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం ఉండదు. మన మొబైల్లో default గా ఉండటం వల్ల మనకి చాలా ఉపయోగపడుతుంది.
9️⃣ Long Screenshot – page మొత్తం ఒకే imageలో
Scrolling screenshot తో top నుంచి bottom వరకు webpage/chat మొత్తం capture చెయ్యొచ్చు. Notes తీసుకొనే వాళ్లకి best. కొన్నిసార్లు మనం ఒక పేజీని స్క్రీన్ షాట్ తీయాలంటే ఒక నాలుగైదు సార్లు స్క్రోల్ చేసి మొత్తం స్క్రీన్ షాట్ తీస్తే ఒక 5 screenshots అవుతుంది. అలా కాకుండా ఈ లాంగ్ స్క్రీన్ షాట్ ఫీచర్ తో ఒక పెద్ద పేజీని ఒకే ఇమేజ్ గా మనం చేసుకోవచ్చు. ఇది ఎక్కువగా నేను ఉపయోగించే ఫీచర్లో ఒకటి. చాటింగ్ స్క్రీన్ షాట్ తీసే వాళ్ళకి ఉపయోగపడుతుంది అలానే ఏదైనా ఒక వెబ్సైట్ పేజీలో ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్లకు కూడా ఉపయోగపడుతుంది.
1️⃣0️⃣ Focus Mode – distractions automatically block
Instagram, YouTube, Games all distracting apps ను temporaryగా stop చేస్తుంది.
Study, work concentration instantly పెరుగుతుంది. ఇది మొబైల్ ఎక్కువ ఉపయోగిస్తున్నాను అని అనిపించే వారికి మొబైల్ ని అనవసరంగా ఉపయోగించకూడదు అనుకుంటే వాళ్ళకి ఈ ఫ్యూచర్ పనికొస్తుంది. గేమ్స్ ఎక్కువగా ఆడేవారికి, టైంపాస్ కి ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లాంటిది చూస్తున్నప్పుడు వాళ్ల కోసం ఉపయోగపడుతుంది.
1️⃣1️⃣ Battery Optimization (Per App)
ఏ apps ఎక్కువ battery తింటున్నాయో control చేయొచ్చు.
Background activity limit పెడితే battery life noticeably పెరుగుతుంది. మీ మొబైల్ లో ఏ యాప్ ఎక్కువగా బ్యాటరీ ఖర్చు చేస్తుందో మనం దాన్ని తగ్గించవచ్చు ఈ బ్యాటరీ optimization ఉపయోగించి. దీనివల్ల మనం బ్యాటరీ ఎక్కువ కాలం వస్తుంది అలానే చార్జింగ్ కూడా ఎక్కువ సమయం వస్తుంది. అన్నయ్య బ్యాటరీ లైఫ్ కూడా పెరుగుతుంది. మన మొబైల్ యాక్టివిటి ని కంట్రోల్ చేయొచ్చు. మొబైల్ హ్యాంగ్ అవడం లాంటివి జరిగే అవకాశం తక్కువ. అవసరం లేని ఆప్స్ ఉపయోగిస్తున్నప్పుడు ఇది ఆటోమేటిక్ గా దాన్ని optimization చేస్తుంది.
1️⃣2️⃣ Locked Folder – personal photos/videos సురక్షితం
Google Photos లో locked folder చాలా secure.
Phone ఎవరి చేతిలో ఉన్నా ఇవి open అవ్వవు. ఎవరైతే సీక్రెట్ maintain చేస్తారో అలానే కొన్ని ఫొటోలు మరియు files ఎవరికి చూపించకూడదు అనుకుంటే వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మన మొబైల్లో ఏదైనా భద్రంగా గోప్యంగా దారాలనుకుంటే మనం ఎక్స్టర్నల్ యాప్ ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది దానివల్ల మనకి ప్లే స్టోర్ లో ఉన్నప్పుడు కూడా దానివల్ల మనకి కొంత అభద్రత భావం కలగవచ్చు లేదంటే ads ఎక్కువగా రావచ్చు, అలాంటప్పుడు మన మొబైల్లో తో వచ్చే ఈ ఫీచర్ మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. మన ఫొటోస్ వీడియోస్ భద్రంగా ఉంచుకోవచ్చు దానికి lock పెట్టవచ్చు ఒకవేళ లాక్ మర్చిపోయిన సరే మనం కొన్ని ఆప్షన్స్ ఉపయోగించి తిరిగి కొత్త lock పెట్టుకోవచ్చు.
1️⃣3️⃣ Text From Images – photo నుంచి text copy
చిత్రంలో ఉన్న text ను copy చేసి direct గా notes లో paste చేసుకోవచ్చు.
Bills, books, documents all easy. ఫోటోలో ఉన్న text మన అవసరాలకు ఉపయోగించుకోవాలి అనుకుంటే లేదంటే డైరెక్ట్ గా ఫోటో పంపించకుండా ఈ మెసేజ్ రూపంలో ఆ text పంపించాలంటే అలాంటప్పుడు ఇది ఉపయోగపడుతుంది. దీనికి చాలా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాను.
1️⃣4️⃣ Quick App Switch – multitasking super fast
Navigation bar లో Recent button ని double-tap చేస్తే previous app కి instant jump అవుతుంది.
Heavy multitaskers కి gold feature. మమల్ని ఉపయోగించి షార్ట్ కట్స్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అలాంటప్పుడు ఎలాంటి ఫీచర్స్ కొంతమందికి బాగా ఉపయోగపడుతుంది. ఎవరైతే మొబైల్ బాగా వాడుతూ కొత్త ఆప్షన్స్ ని కోరుకుంటారో వాళ్లకి అలాంటివి బాగా నచ్చుతుంది. దీనివల్ల వాళ్ళకి ఎంతో శ్రమ తగ్గుతుందని అనిపిస్తుంది.
1️⃣5️⃣ Device Controls – ఒకే చోట smart devices control
Android ఇప్పుడు nearby smart devices detect చేసి quick panel లోనే control options ఇస్తుంది.
Lights, TV, AC—all one-touch. మన తరుచుగా ఉపయోగించే డివైస్ కోసం ఇది ఉపయోగపడుతుంది. దీంతో మనం టీవీ ఏసి లైట్స్ లాంటి వాటిని మనం మన మొబైల్ ఫోన్ తోనే ఆన్ మరియు ఆఫ్ చేయొచ్చు. Iot home appliances అన్నమాట.
⭐ ముగింపు
Android hidden features గురించి తెలుసుకున్న తర్వాత phone వాడకం literally half effort తో double productivity ఇస్తుంది. మనకు తెలియకపోవడం వల్లే ఇవి use కాకుండా ఉంటాయి కానీ, ఒకసారి try చేస్తే రోజువారీ పనులు చాలా faster, smarter అవుతాయి.
మీ phone లో కూడా ఇవన్నీ ఓసారి enable చేసి చూడండి difference వెంటనే గమనిస్తారు. మన మమ్మల్ని ఉపయోగించడం కాదు దాంట్లో చాలా ఫీచర్స్ మనకు చాలా బాగా ఉపయోగపడుతుందని మనకి తెలియదు. రండి సరికొత్త ఫీచర్స్ ని మీకు వివరించడమే మన వెబ్సైట్ యొక్క ముఖ్య ఉద్దేశం. Android mobile లో రోజు రోజుకు వస్తున్న కొత్త అప్డేట్స్ తో కొత్త కొత్త ఫీచర్స్ వస్తూ ఉంటాయి. వచ్చిన కొత్త ఫీచర్స్ కూడా మనకి అవసరాన్ని బట్టి వాళ్ళు ఇస్తుంటారు.
Also Read: Phone ఎందుకు Slow అవుతుంది? ఎలా Fast చేయాలి?











2 thoughts on “Androidలో అందరికీ తెలియని 15 Hidden Features – ఇవన్నీ తప్పక ఉపయోగించాలి! (2025 Guide)”